Enjoying The Joy 1985-05-30
Current language: Telugu, list all talks in: Telugu
The post is also available in: English, German, Chinese (Simplified), Chinese (Traditional).
మానవాతీత అవగాహన :
ఇంత ఆలస్యం అయినందుకు నన్ను క్షమించండి...ఇలా జరుగుతూ ఉంటుంది, ఎం జరిగినా మనం అంగీకరించాలి, దైవం అలా జరిపిస్తుంటుంది. ప్రతిదానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు, మనలో ఏ శక్తి కేంద్రాలున్నాయో వారు మీకు వివరించగలిగుండాలి, మరియు మనలో వాటి నిర్మాణం/పనిచేసే విధానం ఎలా ఉన్నదో అతను మీకు వివరించారు. ఇవన్నీ మన పరిణామం యొక్క వివిధ కాలాల్లో నిర్మించబడ్డాయి. ప్రతీ శక్తి కేంద్రం అలానే నిర్మింపబడింది.
ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మార్గం వలే నిర్మింపబడ్డాయి. ఎడమ మరియు కుడి మార్గాల ద్వారా మీరు మీ ఉన్నతికి కావాలసిన మధ్య మార్గమును సృష్టిస్తారు. మీ శుద్ధ ఇచ్ఛ యొక్క శక్తి ఉద్దానం అయ్యి, జాగృతి చెంది, ఏడవ శక్తి కేంద్రం నుంచీ చొచ్చుకుని పోతుంది, దాన్నే సహస్రారం అంటాము, అంటే, వెయ్యి రేకుల శక్తి కేంద్రం - మెదడు, లేదా మెదడులో లింబిక్ ని కప్పే కొంత భాగం. పరమాత్మ యొక్క ప్రతిబింబమే ఆత్మ . అది మన హృదయంలో నివసిస్తుంది. ఎప్పుడైతే కుండలిని ఆత్మయొక్క పీఠమైన సహస్రారాన్ని తాకుతుందో, అది హృదయంలో ప్రతిబింభించి, జ్ఞానోదయం పొందుతుంది. దీని అర్థం ఆత్మ జ్ఞానోదయం పొందుతుందని అర్థం కాదు. ధ్యాస అన్నది ఒక చీర లాంటిది, అది పైకి ఇలా (శ్రీమాతాజీ వీడియోలో చూపిస్తారు) నెట్టివేయబడి, తాకి, సహస్రారంలో పీఠం కలిగిన, హృదయంలో ఉన్న ఆత్మను ప్రభావితం చేసి మన కేంద్ర నాడీ వ్యవస్థలోకి ప్రవేశించటం మొదలుపెడుతుంది.
కాబట్టి, మీ తలపై చల్లటి గాలి రావటమనేది మీకు కలిగే మొదటి అనుభూతి. మీకు కలిగే రెండవ అనుభూతి: సర్వ వ్యాపకమైన శక్తి, అదే పరమ చైతన్యం. ఇప్పుడు మీరు మీ అవగాహన యొక్క సూక్ష్మ స్థితిలోకి ప్రవేశించారు. మొదట మానవ అవగాహన పెరుగుతుంది, కానీ ఎప్పుడైతే మీరు మీ ఆత్మను తాకుతారో/తెలుసుకుంటారో, ఆలోచనా రహితమైన అవగాహనను పొందుతారు. కానీ ఆలోచన ఉండదు, స్థూలం/భౌతికం పోతుంది, ఆలోచనలు మాయమవుతాయి. మీరు సూక్ష్మంగా మారతారు. ఈ సూక్ష్మత మీకు కొన్ని శక్తులను ఇస్తుంది. మీ అవగాహన సమిష్టి స్పృహలోకి రావటం మీకు దొరికే మొట్ట మొదటి శక్తి. మీ చేతి వేళ్ళ కొనల మీద మరొక వ్యక్తిని అనుభూతి చెందుతారు. అంటే మీ అవగాహన చాలా ఖచితమైనదవుతుంది.
ఎలా అంటే, ఇవాళ నేను మెక్సికో దేశానికి వెళ్ళాను, ఈ దేశం గురించి ముందే తెలుసు కానీ అప్పుడు నా యొక్క ధ్యాస అంత లోతుగా లేదు. దేశం మొత్తం చాలా ఎక్కువ ఎడమవైపు సమస్య ఉన్నట్లు తెలుసుకున్నాను, ఈ ఎడమవైపు సమస్య ఈ ప్రాంతాన్ని(శ్రీమాతాజీ ప్రసంగం ఇస్తున్న ప్రాంతం) కూడా ప్రభావితం చేస్తుంది. మీ ఎడమవైపు బరువుగా అవ్వడం ద్వారా ఎడమవైపు సమస్యను చాలా స్పష్టంగా అనుభూతి చెందగలరు. మరియు మీ అన్ని శక్తి కేంద్రాల్లో వేడి తెలుస్తుంది. అందువలన మీరు వాతావరణాన్ని, దేశాన్ని, మనుషుల్ని, మిమ్మల్ని కూడా అనుభూతి చెందగలరు. ఒక నిర్దిష్టమైన ప్రదేశం యొక్క సమస్యని తెలుసుకోగలరు. నా ఉద్దేశ్యం మీకు ప్రారంభంలో అంతగా అనిపించకపోవచ్చు, మొదట్లో మీ సమస్యలను మాత్రమే తెలుసుకోగలరు. తరువాత వేరేవాళ్ళ స్థితిని కూడా అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. తద్వారా అవగాహన మరింత పెరుగుతుంది. కేంద్ర నాడీ వ్యవస్థలో మీరు ఇతర వ్యక్తుల సమస్యలను, మీ స్వంత సమస్యలను అనుభూతి చెందడం ప్రారంభిస్తారు. కానీ మీరు ఎదో బాధనో సమస్యనో అనుభూతి చెందినట్లుకాదు. మీరు వాటిని కొంచెం వేడి లేదా చిన్న నొప్పిగా భావిస్తారు. చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. సరిగ్గా మీరు బారోమీటర్లో/భారమితిలో రికార్డు చేస్తున్నట్లుంటుంది. ఆలా జరిగినప్పుడు మీ స్వంత సమస్యలాగా దానిని వదిలించుకుంటారు. దానిని ఎలా వదిలించుకోవాలో తెలిస్తే తప్పకుండా వదిలించుకుంటారు. నేను చేస్తున్నది అదే. అందుకే నేను ఆలస్యం అయ్యాను. మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు, దాన్ని పూర్తి చేయాలనుకుంటారు, తరవాత మీరు మరొక పనికి పూనుకుంటారు. సగం పనిని చేసి వదిలివేయడం ఇష్టపడరు.
మానవులకు ఇది ప్రారంభంలో కష్టం. ఎందుకంటే మీరు మానవ అవగాహన నుంచి మహనీయుని/ఉత్తమమైన మానవుని యొక్క అవగాహనకు అభివృద్ధి చెందుతున్నారు. దీన్నే ఉత్తమమైన అవగాహన అంటారు. దీని నుంచీ సూక్ష్మ అవగాహనకు వృద్ధి చెందుతారు. కాబట్టి, మొదట అవగాహన పెరుగుతుంది, తరువాత అవగాహన సూక్ష్మం అవుతుంది. కానీ దానితో మీరు ఏ రకమైన అసౌకర్యంగా గానీ, కలతగానీ చెందరు. ఎందుకంటే మీరు చాలా శక్తివంతులు అవుతారు. అట్లాంటి కరుణ యొక్క శక్తి వలన మీకు ఏమీ అనిపించదు. ఎలాంటి నొప్పిగానీ, సమస్యలు గానీ ఉండవు. భ్రమలు పూర్తిగా అదృశ్యమవుతాయి. మనసులో భ్రమకు ఇక తావు లేదు.
మీరు ఏదైనా ఎదుర్కొన్నప్పుడు దురాశ లేదా కామంతో నిండిపోతారని ప్రజలు చెప్తుంటారు. కానీ మీ కళ్ళు స్వచ్ఛమైనప్పుడు దురాశ లేదా కామం ఉండదు. మీరు
వేరే దానితో ఏకత్వాన్ని అనుభూతి చెందడం మొదలు పెడితే, అది ఏదైనా సరే, ఒక రకంగా చాలా ఆనందాన్నిస్తుంది. మీరు ఒక ఆకర్షణీయమైన వ్యక్తిని చూసినట్లయితే, ఆ వ్యక్తిపై ఏ రకమైన భావాల అనుభూతి లేదు, కానీ సంచలనం అదృశ్యమయి మరియు ఆ వ్యక్తి లేదా వస్తువు యొక్క సృష్టి యొక్క ఆనందాన్ని అనుభవించడం ప్రారంభిస్తారు.
మెక్సికో దేశంలో చాలా వస్తువులు చేతితో తయారు చేస్తుంటారు, వాటిని మీరు చూసినప్పుడు వాటి వ్యయం ఎంత, ధర ఎంత, ఎవరు తయారు చేసారో అని ఆలోచిస్తుంటారు. కానీ ఏ ఆలోచన లేకుండా మీరు ఏదైనా వస్తువునైనా చూసినట్లయితే, మీరు దానిలో పరమచైతన్యాన్ని అనుభూతి చెందడంవలన చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎవరో దీనిని తయారు చేసారని మీకు తెలుసు, వారు ఆత్మసాక్షాత్కారి అయి ఉండొచ్చు, భగవంతునికి గొప్ప భక్తుడు అయ్యి ఉండొచ్చు, "ఓ భగవంతుడా ఇదంతా నీ సృష్టియే" అని, ఆ అనుభూతితో సంతృప్తిగా తయారు చేసి ఉండొచ్చు అందువలన మనం తప్పకుండా తీసుకోవాలి అని మీరు భావిస్తారు. భౌతిక వస్తువులకు ఒకటే సామర్ధ్యం ఉన్నది, అది ఇతరులకు ఇవ్వడంలో ఆనందాన్ని ఇస్తుంది. తద్వారా మీ ఆనందాన్ని దానిలోనికి వ్యక్తపరచవచ్చు. కాబట్టి ఈ భౌతికమైన వాటి గురించి చాలా సూక్ష్మంగా తెలుసుకుంటారు. వాటిని అర్థం చేసుకోవడం మొదలుపెడతారు, అసలు భౌతికమైన వాటి అర్థం ఏమిటి, ఒక నిర్దిష్ట వస్తువు యొక్క ఉపయోగం ఏమిటో తెలుసుకుంటారు.
అదే విధంగా మీరు అస్సలు పరిచయంలేని క్రొత్త వ్యక్తులని కలిసినప్పుడు, వారి అవసరాలేమిటో, వారికీ ఏమి సమస్యలు ఉన్నాయో విస్తృత స్థాయిలో మరియు సమిష్టి స్థాయిలో మీకు తెలుసు. మెక్సికో దేశంలో కొంతమంది ప్రజలు భగవంతుణ్ణి వెతుకుతున్నవారు(సీకర్స్) ఉన్నారన్న సాధారణ విషయం మీకు తెలుసు. వారికి సహాయం చేస్తారు, వారికి అవసరమైనవి ఇస్తారు. వారికీ ఈ భౌతిక వస్తువులు ఇవ్వడంలో ఆనందం తెలియకపోవచ్చు, కానీ మనకి వాటిగురించి తెలిసింది. చాలా సూక్ష్మమైన రకానికి చెందిన ఒక విధమైన సంబంధం ఏర్పడి మీరు ఇతర వ్యక్తుల పట్ల ఆకర్షితులవుతారు. ఏ కామంతోనో , దురాశాతోనో లేదా ఏ ప్రయోజనామో ఆశించి కాదు, తమలో తాము ఏ ఆనందాన్ని కలిగి ఉన్నారో, ఏకత్వం ద్వారా ఆ అన్నదాన్ని పొందుతారు, అదే ఆత్మయొక్క ఆనందం. మీరు వారిని చూసినప్పుడు, " ఈ వ్యక్తి ఎంత అద్భుతమైన వ్యక్తి " అని అనిపిస్తుంది. కానీ మీకు ఈ విషయం ఎలా తెలుసు? మీరు ఆ వ్యక్తి నుండి వచ్చే పరమ చైతన్యం మీ చేతుల్లో పొందడం ద్వారా తెలుస్తుంది. అప్పుడు మీరు ఆ వ్యక్తి పేదవాడా, ధనవంతుడా, అందంగా ఉన్నాడా, అందవికారంగా ఉన్నాడా లేదా మరిదేనిగురించి పట్టింపులేకుండా ఆ వ్యక్తిని మాత్రమే ఆనందిస్తారు. మీరు ఆత్మగా మారారు కాబట్టి, మరొక వ్యక్తి యొక్క ఆత్మను చేరుకోగలరు.
మంచి సంబంధ బాంధవ్యాల గురించి శాంతి కార్యకలాపాలను నిర్వహిండమని, అదని, ఇదని రక రకాల కార్యకలాపాలైన పెద్ద విషయాల గురించి వ్యక్తులు మాట్లాడతారు. స్థూల స్థాయిలో ఉన్న అన్ని సంబంధాలు సమస్యలను సృష్టిస్తాయి, ఎందుకంటే దాని వెనుక ఒక విధమైన కనపడని స్వార్థం ఉంది. కానీ ఒకసారి అది ఆధ్యాత్మిక సంబంధంగా మారిన తరువాత నాకేమి లాభం కలుగుతుంది, వేరే వ్యక్తిని కలవటం ద్వారా ఏమి సాధించగలను అని ఎటువంటి చర్చల్లో పాల్గొనకుండా మీరు అవతలి వ్యక్తిని ఆనందించగలుగుతారు. అందువలన మీరు ఆనందాన్ని స్వీకరించేవారవుతారు. ఒక తరంగాలు లేని, పూర్తి అద్దంలా కనిపించే, ప్రశాంతమైన సరస్సువలె కనిపిస్తుంది. ఇది దాని చుట్టూ సృష్టించబడిన అన్నింటినీ పూర్తిగా ప్రతిబింబిస్తుంది మరియు సృష్టి యొక్క పూర్తి ఆనందాన్ని విడుదల చేస్తుంది.
అదే విధంగా ఆత్మ యొక్క కాంతితో నిండిన హృదయం మరొక వ్యక్తి యొక్క సృష్టి యొక్క పూర్తి ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. అందులో సూక్ష్మంగా ఏది ఉంటె దాన్ని మీరు ఆనందించారు. అప్పుడు సమయాన్ని మీరు చూసుకోరు, మీరు కాలాతీతులవుతారు, మీరు సమయం గురించి పట్టించుకోరు. ప్రతిదానికి సరైన సమయం ఉంటుంది, అది ఇదే అని మీరు అర్థం చేసుకోవటం మొదలవుతుంది. మీరు సమయానికి బానిసలుగా మారరు, మీరు ఏ అలవాట్లకూ బానిసలుగా మారరు, మీరు ఏ ప్రలోభాలకు బానిసలుగా మారరు, కానీ ఆనందాన్ని ఆస్వాదించే పూర్తి స్వేచ్ఛను మీరు పొందుతారు.
- పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి
పబ్లిక్ ప్రోగ్రాం రెండవ రోజు, సాన్ డియెగోలో (యూ అస్ ఏ ) మే 30 1985